పంజగుట్ట: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై పంజగుట్ట పోలీసులు దాడి చేసి ఇద్దరు సెక్స్‌ వర్కర్లను, ఒక సబ్‌ నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు: శ్రీనగర్‌కాలనీలోని శ్రీనివాసప్లాజాలో వ్యభిచారం జరుగుతుందని పక్కా సమాచారం అందుకున్న పంజగుట్ట క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.నర్సింహరాజు శుక్రవారం అర్ధరాత్రి ఓ కానిస్టేబుల్‌ను కస్టమర్‌గా మొదట అక్కడకు పంపించారు.

అనంతరం దాడులు నిర్వహించి ఇద్దరు యువతులను, సబ్‌ ఆర్గనైజర్‌ ఈస్ట్‌గోదావరికి చెందిన పి.దుర్గ(47)ను అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ నిర్వాహకుడు కె.రాము పరారీలో ఉన్నాడు. యువతులను రెస్క్యూ హోంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.