హైదరాబాద్‌: నగరంలో విషాదం చోటుచేసుకుంది. చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ మహిళా న్యాయవాది ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మీ విహార్‌ ఫేజ్‌ వన్‌ ఢిఫెన్స్‌ కాలనీలో నివసిస్తున్న శివాని భవనంపై పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. న్యాయవాది అయిన శివానికి అయిదేళ్ల క్రితం అర్జున్‌తో వివాహమైంది. వీరికి ఓ కొడుకు ఉన్నాడు.

ఇటీవల భార్య భర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ కలహాల కారణంగా మనస్తాపం చెందిన శివాని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో భర్త అర్జున్‌ లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.