హైదరాబాద్: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై పంజగుట్ట పోలీసులు ఆకస్మిక దాడి చేసి సబ్‌ ఆర్గనైజర్,ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు సోమాజిగూడలోని సూర్యానగర్‌ కాలనీలో ఉన్న నేచ్యురల్‌ స్పా సెంటర్‌లో వ్యభిచారం జరుగుతోందనే సమాచారం అందుకున్న పంజగుట్ట అడిషనల్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.దుర్గారావు నేతృత్వంలో బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది.సబ్‌ ఆర్గనైజర్‌ నర్సింహ,ఇద్దరు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు.ప్రధాన నిర్వాహకుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఇద్దరు బాధిత మహిళలను రెస్క్యూహోంకు తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.