గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సర్దార్ పటేల్ నగర్‌లోని బ్యూటిఫుల్ స్టే ఓయో రూమ్‌పై ఎస్‌వోటి పోలీసులు మంగళవారం దాడులు జరిపారు. వెస్ట్ బెంగాల్‌కి చెందిన 8 మంది మహిళలను పోలీసులు కాపాడి రెస్క్యూ హోమ్‌కి తరలించారు.

ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి నుంచి 10 వేలు నగదు, 5 సెల్ ఫోన్లు, 130 కండోమ్ ఫ్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిన్న(సోమవారం) కూడా కేపీహెచ్బీలోని పలు ఓయో రూమ్లపై బాలానగర్ ఎస్‌వోటి పోలీసులు దాడులు చేశారు. 9 మంది యువతులను రక్షించారు.