బీఫార్మసీ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రామానాయుడు కథనం ప్రకారం: రుద్రారం గీతం విశ్వవిద్యాలయంలో బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రోషిణి ఈనెల 13వ తేదీన సంక్రాంతి సెలవులకు బాబాయి ఇంటికి చెముడులంకకు వెళ్లింది. తిరిగి 16వ తేదీన కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంటి బయలుదేరింది.

22వ తేదీన టాంజానియాలో ఉన్న తండ్రి రాముకు ఫోన్‌చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు కళాశాలకు ఫోన్‌ చేయగా 22వ తేదీ వరకు సెలవులు ఉన్నాయని చెప్పారు. తండ్రి రాము కూతురుకు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.