మందుబాబుల‌కు షాకింగ్ న్యూస్ ఇది. హైద‌రాబాద్ లోని మ‌ద్యం దుకాణాలు రేపు(గురువారం) బంద్ కానున్నాయి. శ్రీరామ‌న‌వ‌మి శోభాయాత్ర సంద‌ర్భంగా వైన్ షాపులు, క‌ల్లు దుకాణాలు, బార్లు, క్ల‌బ్‌లు, ప‌బ్‌లు, ఫైవ్ స్టార్ హోట‌ళ్లు, బార్ రూమ్‌లు మూసివేయాల‌ని అధికారులు ఆదేశించారు. మార్చి 30 ఉద‌యం 6 గంట‌ల నుంచి మార్చి 31 ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు షాపులు బంద్ కానున్నాయి.

నిబంధనలు అతిక్రమించి మద్యం అమ్మితే లైసెన్సులు రద్దు చేయడానికి కూడా వెనుకాడబోమని ఎక్సైజ్ శాఖ హెచ్చరిస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా మద్యం అందుబాటులో ఉంటే శాంతిభద్రతలకు ఇబ్బంది అవుతుందనే కారణంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా జంట నగరాల్లో శోభాయాత్ర నిర్వ‌హించ‌నున్నారు. ఈ శోభాయాత్ర కోసం పోలీసులు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తున్నారు.