జీడిమెట్ల: మహిళకు మాయ మాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి లాగేందుకు ప్రయత్నించిన వ్యక్తికి మేడ్చల్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. సీఐ బాలరాజు ఎస్సై గౌతమ్‌కుమార్‌ వివరాల ప్రకారం: 2021లో విశాఖపట్నంకు చెందిన ఓ మహిళ హైదరాబాద్‌ వచ్చేందుకు కర్నూల్‌ బస్టాండ్‌లో నిలబడింది. కర్నూల్‌లో మహిళను పరిచయం చేసుకున్న అదే ప్రాంతానికి చెందిన బుగ్గన మధుమోహన్‌రెడ్డి(33) ఆమెను హైదరాబాద్‌ తీసుకువచ్చాడు.

అనంతరం ఆమెను వ్యభిచార కూపంలోకి లాగేందుకు ప్రయత్నించగా తప్పించుకున్న మహిళ జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు మధుమోహన్‌ను రిమాండ్‌కు తరలించారు. కేసు పుర్వపరాలు పరిశీలించిన మేడ్చల్‌ జిల్లా కోర్టు మంగళవారం నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా వేసింది.