ఏసీబీ అధికారుల దాడుల్లో బుల్లెట్ బండి సాంగ్ ఫేమ్ అశోక్ పట్టుబడ్డాడు. ఓ వ్యక్తి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇదే ఆఫీస్‌లో టౌన్ ప్లానర్‌గా పనిచేస్తున్న అశోక్ ఓ ఇంటి పర్మిషన్ కోసం రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు.
అయితే బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించగా లంచం తీసుకుంటండగా అశోక్‌ను పట్టుకున్నారు. దీంతో అశోక్ నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా గతంలో ఓ పెళ్లి ఊరేగింపులో బుల్లెట్ బండి సాంగ్‌కు డ్యాన్స్ చేసి పాపులర్ అయిన యువతి భర్తే అశోక్ కావడం గమనార్హం. డ్యాన్స్ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యింది.