హైదరాబాద్ వనస్థలిపురంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్ పేరుతో లక్షకు లక్ష రూపాయలు ఇస్తానని ఓ మహిళ టోకరా వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిందితురాలు స్వర్ణలత సుమారు రూ.14 కోట్లు వరకు వసూలు చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితురాలు స్వర్ణలతపై గతంలోనూ చీటింగ్ కేసు నమోదు అయ్యాయని పోలీసులు తెలిపారు.