వారం రోజుల్లోనే గ్రూప్ 4 ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు. స్టేట్​లో 8,180 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇవ్వగా, జులై1న పరీక్ష నిర్వహించారు. 9,51,205 మంది అప్లై చేయగా 7,62,872 మంది పేపర్-1•, 7,61,198 మంది పేపర్-2 రాశారు. 5 నెలల కిందే ఫైనల్ కీ రిలీజ్ అయినప్పటికీ రిజల్ట్ మాత్రం విడుదల కాలేదు. ఇప్పటికే రిజల్ట్ ప్రాసెస్ అంతా పూర్తయి రెడీగా ఉండటంతో, త్వరలోనే రిజల్ట్​ను ప్రకటించాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది.

ముందుగా జనరల్ ర్యాంకు లిస్టు (జీఆర్ఎల్) ప్రకటించనున్నారు. పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంకు కేటాయించ నున్నారు. మార్కుల ఆధారంగా జిల్లాలు, జోన్లవారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నా రు. ఈ నోటిఫికేషన్‌లో దాదాపు 99 శాఖల పోస్టులుండగా, వాటిలో మెజార్టీ పోస్టులు జిల్లాస్థాయిలో, కొన్ని జోనల్‌ స్థాయిలో ఉన్నాయి.