సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ అపార్ట్‌మెంట్‌లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతి చెందిన వారిని ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, శివ, ప్రశాంత్‌గా గుర్తించారు. దట్టమైన పొగతో వీరు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, భవనంలో ఏడు, ఎనిమిదో అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. చూస్తుండగానే కాంప్లెక్స్‌లోని 7వ, 8వ అంతస్తులకు వ్యాపించాయి. దీంతో ఆ ఫ్లోర్‌లలో వున్న పలు కార్యాలయాలకు చెందిన ఉద్యోగులు చిక్కుకుపోయారు. ఐదో అంతస్తు పూర్తిగా తగులబడిపోయింది. ఇప్పటి వరకు 15 మందిని కాపాడినట్లుగా తెలుస్తోంది. ఇంకా లోపల ఎవరైనా ఉన్నారేమోనన్న కోణంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. సహాయక చర్యలపై ఆరా తీశారు.

Advertisement

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంటలు దాదాపు అదుపులోకి వచ్చాయని, మరో అరగంటలో మంటలన్నీ రెస్క్యూ పూర్తవుతుందన్నారు. ప్రమాదంలో ఏడుగురిని అధికారులు రక్షించారని, మరికొందరు భవనంలో చిక్కుకుపోయారన్నారు. అయితే, లోపల ఎంత మంది ఉన్నది తెలియరాలేదని, వారంతా కేకలు వేస్తున్నారని తెలిపారు. వారిని సైతం కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. భవనంలో ఇనుప రాడ్స్‌ కారంగా భవనంలో వారంతా చిక్కుకుపోయారని, వారిని రక్షించేందుకు అవసరమైన సామగ్రితో పాటు ఆక్సిజన్‌ను సైతం భవనంలోకి పంపినట్లు మంత్రి తెలిపారు. భవనంలో ఉన్న వారికీ ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించారని, దాంతో మంటలు అదుపులోకి వచ్చాయన్నారు. మరోవైపు అగ్నిప్రమాదం గురించి తెలుసుకున్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడారు. లోపల చిక్కుకున్న వారిని తక్షణం కాపాడాలని అధికారులను ఆదేశించారు.