విశాఖపట్నంలోని ఎండాడకు చెందిన ముత్యు శ్రీనివాసరావుకు, భారయ, ఇద్దరు కుమారులున్నారు. అతడు ఓ ఫర్నిచర్ షాపులో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. అతడికి మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలో 2019లో శ్రీనివాసరావుకు ఓ కల్లుపాక వద్ద సూరాడ లక్ష్మన్ అనే యువకుడితో పరిచయమైంది. పరిచయం స్నేహంగా మారడంతో ఓ రోజు లక్ష్మణ్ ను శ్రీనివాస్ తన ఇంటికి భోజనానికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి తరచూ శ్రీనివాస్ ఇంటికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో శ్రీనివాసరావు భార్యతో ఏర్పడిన చనువు వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు లక్ష్మణ్ తో గొడవపడి భార్య చిన్నీని మందలించాడు. అయినా ఇద్దరిలో మార్పురాలేదు, కొన్నిరోజుల తర్వాత లక్ష్మణ్ చిన్నీని తీసుకొని వెళ్లి న్యూ రైల్వే కాలనీలో కాపురంపెట్టాడు. ఐతే భార్య, ఆమె ప్రియుడి ఆచూకీ తెలుసుకున్న శ్రీనివాసరావు గత ఏడాది ఏప్రిల్ లో వాళ్లు నివాసముంటున్న ఇంటికెళ్లి గొడవ చేశాడు.

అదే సమయంలో మంచిగా మాట్లాడిన లక్ష్మణ్ శ్రీనివాస్ ను బైక్ ఎక్కిచుకొని ఎండాడ అక్కడి నుంచి గుడ్లవానిపాలెం అమ్మవారి గుడివద్దకు తీసుకెల్లాడు. బీచ్ కు తీసుకెళ్లి రాయితో శ్రీనివాసరావు తలపై మోదాడి. అతడు అపస్మారకస్థితికి వెళ్లగానే అక్కడి నుంచి పరారయ్యాడు. శ్రీనివాస్ ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. నిందితుడు లక్ష్మణ్ వెంటనే చిన్నీని తీసుకొని విజయవాడ పారిపోయాడు. గత 9 నెలలుగా విజయవాడలో ఉంటున్నారు. శ్రీనివాసరావు కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్న పోలీసులకు అతడి భార్య చిన్నీ, లక్ష్మణ్ ల అక్రమ సంబంధం గురించి తెలిసింది. అప్పటి నుంచి వారిపై నిఘా ఉంచారు. ఐతే తొమ్మిది నెలలైనా తమ కోసం పోలీసులు రాకపోయేసరికి కేసు లేదని భావించి లక్ష్మణ్ విశాఖ ఇంటిలోని సామాన్లు తీసుకెళ్లేందుకు ఇటీవల వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు మాటువేసి వారిని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో తానే హత్య చేసినట్లు లక్ష్మణ్ అంగీకరించాడు.