ఉద్యోగం కోసం ఓ వ్యక్తిని ఆశ్రయించింది యువతీ, తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి యువతిని వెంట తిప్పుకున్నాడు. ఆమె అవసరాన్ని ఆసరాగా తీసుకున్నాడు. నేనుంటే నీకు ఎలాంటి కష్టం రాదని లోబరుచుకున్నాడు వివరాల ప్రకారం: నెల్లూరు జిల్లా సూళూరు పేటలో నివాసం ఉంటున్నాడు 50ఏళ్ల గోపాల్ అతనికి శ్రీహరికోట శబరి కాలనీకి చెందిన 19ఏళ్ల యువతీ పరిచయం అయ్యింది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పింది. తెలిసిన చోట ఏదైనా స్వీపర్ పని ఇప్పించాలని ప్రాధేయ పడింది. దింతో నేనుండగా నీకేం భయం శ్రీహరి కోటలో స్వీపర్ ఉద్యోగం అంటూ హామీ ఇచ్చాడు గోపాల్. యువతి అవసరాన్ని ఆసరాగా తీసుకున్న గోపాల్ యువతిని ఎలగైన ముగ్గులోకి దింపాలని చూసాడు. ఒకరోజు యువతిని ఉద్యోగం గురించి మాట్లాడాలని రమ్మని పిలిపించాడు. నీకు ఉద్యోగం రావడం ఖాయమని తాను చెప్పిన వెంటనే ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పడు. అయితే చెప్పినట్లు చేస్తేనే ఉద్యోగం వస్తుందని పేద యువతిని వంచనకు గురి చేసాడు. స్వీపర్ ఉద్యోగం కోసం నా కోరిక తీర్చాలని చెప్పాడు.

అతడి కోరిక తీర్చడానికి ఆమె సారేమిరా అంది ఇంటి అవసరాలకు డబ్బులు రావాలంటే ఉద్యోగం కావాలి అనే భావనలో గోపాల్ మాయమాటలకు లొంగి పోయింది. దింతో ఆ యువతికి స్వీపర్ ఉద్యోగం ఇప్పించాడు. అక్కడితో ఆగక అవసరమైన సందర్భాల్లో తన కోరిక తీర్చాలని హుకుం జారీ చేసారు. తనకు కోరికలు పుట్టిన ప్రతిసారి యువతీపై లైంగిక దాడి చేసే రాక్షర ఆనందం పొందే వాడు. నిత్యం ఆమెపై లైంగికదాడికి పాల్పడటంతో గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న గోపాల్ యువతిని తన బంధువుల ఇంటికి తీసుకువెళ్లి అబార్షన్‌ చేయించాడు. ఈ విషయం బాధితురాలి తల్లిదండ్రులకు తెలియడంతో, బుధవారం వారు ఆమెను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి ఫిర్యాదు చేయించారు. నిందితుడిపై పోలీసులు రేప్‌ కేసు నమోదు చేశారు.