వ‌రంగ‌ల్ అర్భ‌న్ జిల్లా: మ‌త‌సామ‌రస్యానికి కాపాడ‌టంతోపాటు.. ముస్లీం సంక్షేమానికి కృషిచేస్తున్న ప్ర‌భుత్వం సియం కేసిఆర్ సార‌థ్యంలోని టిఆర్ఎస్ ప్ర‌భుత్వమేనని పంచాయ‌తీరాజ్ శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. TNGO’S సంఘం ఆద్వ‌ర్యంలో హ‌న్మ‌కొండ అమృత గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయ‌న హాజ‌ర‌య్యారు. సియం కేసిఆర్ ప్ర‌భుత్వ హాయాంలో రాష్ట్రంలో మ‌తాల మ‌ద్య ఘ‌ర్ష‌ణ‌లు లేకుండా స్నేహా పూర్వ‌కంగా క‌లిసి మెలిసి ఉండే విధంగా కృషి జ‌రుగుతుంద‌న్నారు. అన్ని మ‌తాల పండుగ‌ల‌ను ప్ర‌భుత్వం గుర్తించి చేదోడుగా నిలిచింద‌న్నారు. పేద ముస్లీంల కోసం మైనార్జీ గురుకులాల‌ను ఏర్పాటు చేసిన ఘ‌న‌త తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానిదేన‌ని అన్నారు. దేశంలోనే ముస్లీంలకు ప్రాధాన్య‌త క‌ల్పించిన ఘ‌నత సియం కేసిఆర్ ప్ర‌భుత్వానిదేనని అన్నారు. ముస్లీం సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు రంజాన్ ప‌విత్ర మాసోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో వ‌రంగ‌ల్ న‌గ‌ర మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్‌రావు, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే దాస్యం విన‌య్‌భాస్క‌ర్‌, టియ‌న్జీవోల నాయ‌కులు ప‌రిటాల సుబ్బారావు, కారం ర‌వింధ‌ర్‌రెడ్డి, జ‌గ‌న్‌మోహ‌న్‌రావు, రాజేంద‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.