అమెరికాలోకి దొడ్డి దారిన ప్రవేశించాలనుకున్న 311 మంది భారతీయులను వెనక్కి పంపిస్తున్నారు. వీరంతా అమెరికా పోయేందుకు గత కొద్ది నెలల్లో మెక్సికోకు చేరుకున్నారు. ఏజెంట్లు మెక్సికో నుంచి వీరిని అమెరికాలోకి పంపుతామని హామీ ఇవ్వడంతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడికి చేరుకున్నారు.

ఒక్కొక్కరి నుంచి 25 నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేసిన ఏజెంట్లు రెండు విమానాల ద్వారా వీరిని మెక్సికోకి చేర్చారు. వారం నుంచి నెల రోజుల్లోపు వీరిని అమెరికాకు పంపిస్తామని హామీ ఇచ్చారు. అయితే మెక్సికో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ అక్రమ ప్రవేశాన్ని పసిగట్టి 311 మంది భారతీయుల్ని అదుపులోకి తీసుకుని తిరిగి ఢిల్లీకి పంపించేస్తున్నారు. 60 మంది సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసి వీరిని ఢిల్లీలో వదిలి పెట్టనున్నారు.

మెక్సికో నుంచి అమెరికాకు అక్రమ వలసలు ఎక్కువ కావడంతో అమెరికా ఇటీవల కాలంలో మెక్సికోలో అక్రమ చొరబాటు దారులను అరికట్టాలని ఒత్తిడి తెచ్చింది. రేపు ఉదయం ప్రత్యేక విమానం ద్వారా భారతీయులను ఢిల్లీకి తీసుకురానున్నారు.