{"source":"other","uid":"2B42303B-2021-4A00-9841-243360D6BB92_1643302429258","origin":"gallery","is_remix":true,"used_premium_tools":false,"used_sources":"{"version":1,"sources":[{"type":"ugc","id":"332771724054211"}]}","source_sid":"2B42303B-2021-4A00-9841-243360D6BB92_1643877444914","premium_sources":[],"fte_sources":["332771724054211"]}

భారీ కమీషన్ వస్తుందన్న అత్యాశతో ఉన్నందా పొగొట్టుకుందో యువతి. వివరాల్లోకి వెళ్తే: ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని 12వ వార్డుకు చెందిన ఓ యువతి చదుపు పూర్తి చేసింది. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఇంతలో ఆమెకు వాట్లాప్ ద్వారా ఓ మేసేజ్ వచ్చింది. ఆ లింక్ లో చెప్పిన విధంగా ముందుగా వారికి రూ.100 ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేసింది. కొన్ని వస్తువులు కొనడంతో మీకు కమిషన్ వస్తుందని అవతలి వ్యక్తి నమ్మించారు. అలా మూడుసార్లు కమిషన్ వచ్చినట్లు కొంత నగదు ఇచ్చారు. దీంతో అత్యాశకు పోయిన హిమబిందు మరింత డబ్బు చెల్లించారు. ఐతే కమీషన్ లక్షల్లో వస్తుందని అందుకోసం ముందుగా 30శాతం నగదు డిపాజిట్ చేయాలని అవతలి వ్యక్తులు నమ్మించారు. దీంతో ఆమె మొత్తం రూ.4.73లక్షలు వారి ఖాతాలో డిపాజిట్ చేసింది. ఐతే ఆ తర్వాత అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి పాలకొల్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రజలు ఇలాంటి ప్రకటనలు నమ్మి సైబర్ ముఠాల చేతిలో పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు. గతంలో గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఇలాంటి ఘటనలే వెలుగు చూశాయి. ఆన్ లైన్ బిజినెస్, ఆన్ లైన్ యాడ్స్, వాటిపై కమిషన్ పేరుతో అమాయకుల వద్ద లక్షలు దోచేస్తున్న ముఠాలు ఆ తర్వాత కనిపించకుండా పోతున్నాయి. కొన్ని ముఠాలు ఫ్లైట్ టికెట్ల క్యాన్సిలేషన్ పేరిట జనాన్ని అడ్డంగా దోచేస్తున్నాయి. గతంలో గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి సైబర్ కేటుగాళ్లు ఏకంగా రూ.10లక్షలకు టోకరా వేసిన సంగతి తెలిసిందే. టికెట్ క్యాస్నిలేషన్ కోసం ఓ యాప్ లింక్ క్లిక్ చేయగా ఖాతాలోని డబ్బంతా మాయమైంది. బాధితుడు సకాలంలో స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొంత మొత్తం వెనక్కి వచ్చేలా చర్యలు తీసుకున్నారు.