మొన్నటి సార్వత్రిక ఎన్నికల వేళ అవకతవకలు జరిగాయని.. ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ల ఎన్నిక చెల్లదంటూ ఓడిపోయిన అభ్యర్థులు దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు విచారించింది. మొత్తం ఆరుగురు గులాబీ ఎమ్మెల్యేల కు హైకోర్టు నోటీసులు పంపింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మల్కాజిగిరి ఎమ్మెల్యే హనుమంతరావు, ల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటీషన్ల పై విచారించిన హైకోర్టు వారికి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం లో ఈ ఎమ్మెల్యే ల దగ్గర భారీ ఎత్తున నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారని. వాటికి లెక్కలు చూపించ లేదని పిటీషనర్లు వ్యాజ్యం లో పేర్కొన్నారు.

కొడంగల్ లో ఎమ్మెల్యేగా గెలిచిన నరేందర్ రెడ్డి మామ ఫామ్ హౌస్ లో 51 లక్షల నగదు 6 కోట్ల ఖర్చు డైరీ ఈసీకి సమర్పించలేదని ఆయన పై అనర్హత వేటు వేయాలని కోరారు. ఇక మిగతా ఎమ్మెల్యేలు కూడా ఖర్చు కు తగిన లెక్క చూపలేదని కొందరు ఓటింగ్ లో అక్రమాలకు పాల్పడ్డారని పిటీషనర్లు హైకోర్టుకు ఆధారాలతో పిటీషన్ దాఖలు చేశారు…