సామాజిక మాధ్యమాల్లో కొద్దిరోజులుగా వైరల్ అవుతున్న ఈ మహిళా పోలింగ్ అధికారి ఫొటోను చూసే ఉంటారు. ఈ ఫోటోపై నెటిజన్లు తెగ జోకులు వెస్తున్నారు. 100 పోలింగ్ జరగలంటే ఇలాంటి పోలింగ్ అధికారులను నియమించాలంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు. ఈ విధంగా ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. ఆమెకు సంబంధించిన రకరకాల ఫొటోలు, కామెంట్లు ఆన్ లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ అధికారి పేరు నళిని సింగ్ అంటూ ఆమె పలాన రాష్ట్రానికి చెందిన వారంటూ ఎవరికి తోచిన విధంగా వారు ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆమె పనిచేసిన జైపూర్ పోలింగ్ బూత్‌లో 100 శాతం పోలింగ్ జరగిందంటూ చర్చించుకుంటున్నారు. నెటిజన్లు ఇలా ఆమె గురించి రకరకాలుగా పోస్టులు పెడుతుండడంతో పాటు హూ ఇస్ యెల్లో సారీ ఎలక్షన్ ఆఫీసర్ అంటూ గూగుల్లో బ్రౌజ్ చేస్తున్నారు.

దీంతో మీడియా కూడా ఆమె గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించింది. ఎట్టికేలకు వివరాలు రాబట్టారు. ఈమె అసలు పేరు రీనా ద్వివేది. ఈమె లక్నోలోని పోలింగ్ బూత్‌లో పనిచేశారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆమెకు కెటాయించిన పోలింగ్ బూత్‌కు ఈవీఎంలను పట్టుకుని ళ్తున్న సమయంలో తీసిన ఫోటో అది.ఫొటో జర్నలిస్ట్ తుషార్ రాయ్ ఈమె ఫొటోలను తీశాడు. లక్నోలో పీడబ్ల్యూడీ విభాగంలో రినా జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది.