కృష్ణగిరి జిల్లా పోచంపల్లి సమీపంలో వివాహం చేసుకుంటానని నమ్మించి బాలికను గర్భిణిని చేసిన ఓ కళాశాల విద్యార్థిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాలు: కృష్ణగిరి జిల్లా పోచంపల్లి సమీపంలోని 17 ఏళ్ల బాలిక ప్లస్‌టూ చదువుతోంది. అదే ప్రాంతంలో పాపనూరుకు చెందిన ప్రవీణ్‌కుమార్‌ (19) కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

ఈ క్రమంలో ప్రవీణ్‌కుమార్‌ విద్యార్థినితో పరిచయం పెంచుకుని సన్నిహితంగా మెలిగాడు. దీంతో ఆ బాలిక ఎనిమిది నెలల గర్భిణి అయ్యింది. అయితే బాధితురాలిని వివాహం చేసుకోవడానికి ఆ విద్యార్థి తిరస్కరించాడు. తరువాత ఆమెను బెదిరించినట్లు తేలింది. దీంతో బాధితురాలు బర్గూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ అముద కేసు నమోదు చేసి ప్రవీణ్‌కుమార్‌ను ఆదివారం ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.