ఆ డాక్టర్ భార్య పేరు రిమ్‌ఝిమ్ ఆమెకు బ్యూటీపార్లర్ ఉంది. కొన్ని నెలల క్రితం ఆమెకు రోహిత్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తనకు వ్యాపారంలో తీవ్రంగా నష్టం వాటిల్లిందని ఏం చేయాలో అర్థం కావడం లేదని రోహిత్ తన ఆవేదనను ఆమెతో పంచుకున్నాడు. ఆ సమయంలో రిమ్‌ఝిమ్ అతనికి ఓ సలహా ఇచ్చింది. ఓ తాంత్రిక పూజ జరిపిస్తే వ్యాపారం పుంజుకుంటుందని రోహిత్ కోసం రెండు షర్ట్స్ కూడా ఆర్డర్ చేసింది. ఆ షర్ట్ ధరించి పూజ చేయాలని చెప్పగా రోహిత్ అలానే చేశాడు. రోహిత్ వ్యాపారం మెల్లిగా నష్టాల నుంచి గట్టెక్కింది. దీంతో రోహిత్ ఆ పూజలు చేయడం వల్లే తనకు వ్యాపారంలో మళ్లీ కలిసొచ్చిందని బలంగా నమ్మాడు. రిమ్‌ఝిమ్‌కు థ్యాంక్స్ చెప్పాడు అయితే, ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత రోహిత్ బావ అకస్మాత్తుగా చనిపోయాడు. బావ మరణం రోహిత్‌ను బాగా కుంగదీసింది. ఆ సమయంలో రిమ్‌ఝిమ్ మరో తాంత్రిక పూజ జరిపిస్తే అంతా మంచి జరుగుతుందని రోహిత్‌కు చెప్పింది.

అయితే, ఈసారి ఆమె మాటలను రోహిత్ నమ్మలేదు. ఆ పూజలు చేయడం వల్లే తన ఇంట్లో కీడు జరిగిందని భావించిన రోహిత్ మళ్లీ తాంత్రిక పూజలు జరిపించేందుకు నిరాకరించాడు. అతను పూజ చేయడం నిరాకరించడంతో ఈ తాంత్రిక పూజ జరిపించకపోతే మీ ఇంట్లో ఊహించలేని కీడు జరుగుతుందని ఆమె భయపెట్టింది. పలుమార్లు రోహిత్‌ను బెదిరించింది, ఈ విషయాన్ని రోహిత్ తన స్నేహితులైన కమల్ సూరజ్, పవన్‌కు చెప్పాడు. ఈ తాంత్రిక పూజ జరిపించాలని రోహిత్‌పై రిమ్‌ఝిమ్ రోజురోజుకూ ఒత్తిడి చేస్తూ ఇబ్బందిపెట్టడంతో ఆమెను చంపేయాలని రోహిత్ నిర్ణయించుకున్నాడు. కిల్లర్లకు రూ.4 లక్షలు సుపారీ ఇచ్చాడు. రిమ్‌ఝిమ్‌కు రోహిత్‌తో ఫోన్ చేయించి నౌబత్‌పూర్ దగ్గరకు రావాలని కోరడం, ఆమె అక్కడకు రాగానే కాల్చి చంపడం జరిగింది. నిందితుల వద్ద నుంచి పోలీసులు రూ.2లక్షల 30వేల డబ్బు, పిస్టల్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇలా తాంత్రిక పూజలు జరిపించే వారితో చేతులు కలిపి ఆ పూజలు చేయించాలని రోహిత్‌ను ఒత్తిడి చేసిన డాక్టర్ భార్య కథ చివరికిలా ముగిసింది.