మగాడిమీద దీని కన్ను పడితే మాడి మసై పోవాల్సిందే దీనిపేరు షాదాన్ సుల్తానా. ఉండేది అంబర్ పేటలో మొదట మాటలు కలిపి తరువాత ప్రేమవల విసురుతోంది ఆ వెంటనే లక్షలు డిమాండ్ చేస్తుంది. ఇవ్వకుంటే అత్యాచారం ప్రయత్నం అంటూ కేసు పెడుతుంది ఇలా ఇప్పటివరకు హైదరాబాద్ లో ఈ కిలాడి 27 మంది యువకులపై కేసులు పెట్టింది. ఆబిడ్స్‌ చిరాగ్‌అలీలేన్‌లో ఓ సంస్థలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అబ్దుల్‌ రహీం(30) గత నెల 19న అపస్మారక స్థితిలో ఉస్మానియా ఆసుపత్రిలో చేరాడు. సమాచారం అందుకుని ఆసుపత్రికి వెళ్లి అతని స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి విచారణ చేపట్టగా విస్తుగొలిపే అంశాలు పోలీసుల దృష్టికొచ్చాయి.

2018లో సుల్తానా పనిమీద అబ్దుల్‌ రహీం కార్యాలయానికి వెళ్లింది. అతని మొబైల్ నంబరు తీసుకొని తరచూ ఫోను చేసేది. ఈ క్రమంలో గత ఏడాది జూన్‌లో రూ.4 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. లేని పక్షంలో అత్యాచారం, కిడ్నాప్‌ చేసినట్లు కేసులు పెడతానంటూ బెదిరించింది. భయపడిన అతడు రూ.3 లక్షలు ఆమె బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేశాడు. కొన్నాళ్లకు తిరిగి బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి రూ.5 లక్షలు ఇస్తావా? చస్తావా అంటూ బెదిరించడం ప్రారంభించింది.

ఇవ్వలేనని చెప్పడంతో.. గత నెల 19న నిద్రమాత్రలు తీసుకొచ్చి ఇవి మింగి ఆత్మహత్య చేసుకో అంటూ బలవంతం చేసింది. అతను ఆ మాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో.. ఆటోలో తీసుకొచ్చి ఉస్మానియా ఆసుపత్రిలో వదిలిపెట్టి వెళ్లిపోయింది. బాధితుడి వివరాలు, కాల్‌డేటా ఆధారంగా ఆబిడ్స్‌ పోలీసులు సమగ్ర విచారణ జరిపి ఎట్టకేలకు ఆమెను శుక్రవారం అరెస్టు చేశారు. గతంలోనూ మూడు కమిషనరేట్లలో కిడ్నాప్‌, అత్యాచారాలు, బెదిరింపులకు పాల్పడినట్లు పలువురు వ్యక్తులపై సుల్తానా 27 కేసులు పెట్టినట్లు విచారణలో తేలింది. ఆయా కేసుల్లో ఎవరెవరిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి వారి నుంచి ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేసింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు…