కల్తీ – నాశిరక ఆహార పదార్థాలతో వినియోగదారుల ఇక్కట్లు

  • ఆహార పదార్థాలలో కల్తీ: పట్టించుకోని అధికారగణం

ప్రజల ప్రాణాలతో చెలగాడమాడుతున్నారు ఇటీవల మార్కెట్లో కల్తీ , నాశిరక వస్తువులు రాజ్యమేలుతున్నాయి . ఏది అసలు ? ఏది నకిలీ ? గుర్తించడం కష్టతరంగా మారింది . కొందరు అనతి కాలంలో ధనవంతులు కావాలన్న దురాశతో ఆహార పదార్థాల్లో కల్తీ చేస్తున్నారు . నిత్యం వినియోగించే వంట నూనెల నుంచి ఉదయం పాల వరకు అనేక ఆహార పదార్ధాలను కల్తీ చేస్తున్నారు . ఈ కల్తీ పదర్ధాల వల్ల కాన్సర్ ఇతర అనేక వ్యాధులు సోకుతున్నట్లు వైద్య నిపుణుల అధ్యయనంలో తేలింది . అయిన ప్రభుత్వం కల్తీ ని నియంత్రించడంలో సఫలం కాలేక పోతోంది ఆహార పదార్థాలు కల్తీని నియంత్రించాల్సిన అ స్పెక్టర్లు కొరత తీవ్రంగా నెలకొంది . ఒక్కో అధికారి రెండు , మూడు జిల్లాలకు అదనపు బాధ్యతను నిర్వహిస్తున్నారు .

ఫలితంగా ఏ జిల్లాలో సరిగా విధులు నిర్వర్తించలేకపోతున్నారు . కొందరు మామూళ్లుతో సరిపెట్టుకుంటున్నారు ఎవరైనా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే మినహా అధికారులు స్వతహాగా దాడులు చేసిన కేసులు నమోదు చేసిన సంఘటనలు లేవనే చెప్పవచ్చు ఇటీవల మృతిచెందిన పశువులు , ఇతర జంతువుల ఎముకల నుంచి కూడా నూనెలో వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి . నిల్వ ఉన్న ఆహార పదర్దాల వల్లే అనేక వ్యాధులు సోకుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు . నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్లో మాంసం కోనుగోల్లు జరుగుతున్నాయి , ముందుగా విటర్నరీ డాక్టర్ పరిశీలించి ధృవీకరణ తర్వాతే మేకలు , గొర్రెలు మాంసంను విక్రయించాల్సి ఉంది . అయితే ఈ నిబంధనలు ఆచరణలో అమలు కావడంలేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి . ఇలావుంటే హోటళ్లులో కూడా నాశిరకం నూనెలను వినియోగిస్తున్నారు . ప్రజలకు హాని కలిగించే రంగులు సైతం విచ్చల విడిగా వినయోగిస్తున్నారు .

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫుడ్ ఇన్ స్పెక్టర్లు కొరత నెలకొంది . ఒకే అధికారి మూడు జిల్లాలకు అదనపు బాధ్యతలు వహిస్తున్నారు . మార్కెట్లో ఏది కల్తీ అనేది గుర్తించని విధంగా బ్రాండెడ్ కంపెనీల ప్యాకింగ్ చేస్తున్నారు . ఫలితంగా సామాన్య ప్రజలు గుర్తించలేకపోతున్నారు . గ్రామీణ ప్రాంతాల్లో అనేక బ్రాండెట్ పేర్లుతో నాశిరకం కాస్మోటిక్స్ , ఇతర పరికరాలు అతిచౌకగా లభిస్తున్నాయి . వీటిని వినియోగించడంతో చర్మ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు . వారాంతపు సేలవుల్లొ ఈ నకిలీ బ్రాండ్ల వస్తువులు ఎక్కువగా విక్రయిస్తున్నారు .

నిరక్ష్యరాస్యులైన వినియోగదారుల వల్ల కొందరు వ్యాపారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు . ప్రభుత్వం నిషేధించిన ముందులు సైతం విక్రయాలు జరుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి . ఈ విషయంలో సంబంధిత అధికారుల ఉదాసీనవైఖరి వల్ల అనేక పర్యాయాలు నష్టపోతున్నారు . రోజురోజుకు మార్కెట్లో రాజ్యమేలుతున్న కత్తీ ఆహార పదార్థాలకు కళ్లెం వేయాల్సిన విధి సంబంధిత అధికారులుపై ఎంతైనావుంది …