ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదే ఏపీలో కేసీఆర్ వైన్ షాప్. ఏపీలో తెలంగాణ సీఎం కేసీఆర్ పేరుతో వైన్ షాపు నడుస్తొందన్న వార్త ఒకటి ఫేస్ బుక్ వాట్సప్‌లో చక్కర్లు కొడుతుంది. అయితే అందరూ ఈ షాపు ముందు కేసీఆర్ వైన్ షాప్ అని రాసి ఉండటం చూసి తెలంగాణ సీఎం పేరు పెట్టారేంటి అని చర్చించుకుంటున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఈ కేసీఆర్ వైన్ షాప్ నెల్లూరు జిల్లాలోని వాకాడు మండలం తూపిలిపాలెం అనే మత్స్యకార గ్రామంలో ఉంది. గత కొంతకాలంగా కేసీఆర్ వైన్ షాప్ అనే పేరుతో ఇక్కడ మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారు. అయతే ఈ షాపుకు కేసీఆర్ పేరు ఎలా వచ్చిందంటే లైసెన్స్ యజమాని పేరు కె.చెంగారెడ్డి. దీంతో ఆ వైన్ షాపు పేరు KCRగా ఏర్పాటు చేశారు. షాపు యజమాని వైసీపీ అభిమాని కావడంతో పార్టీ జెండాలోని మూడు రంగులు కన్పించేలా బోర్డులో పెట్టించుకున్నాడు.

మొత్తానికి కేసీఆర్ పేరు పెట్టుకోవడంతో ఇప్పుడీ షాపు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఏపీలో ఇవాల్టి నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వస్తుంది. ప్రభుత్వం పెంచిన ధరలు కూడా అమల్లోకి వచ్చాయి. మద్య నిషేధ కార్యక్రమం అమలులో భాగంగా మద్యం బాటిళ్లపై ARET పేరిట అడిషనల్ రిటైల్ ఎక్సైజు టాక్స్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.