ఒళ్ళు గగుర్పొడిచే యాక్సిడెంట్ ఇది, అతి వేగం ప్రాణాలను తీస్తుందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ అతివేగంతో కారు సృష్టించిన బీభత్సం హైదరాబాద్ ప్రజలను వణికించింది. ఆ భయానక దృశ్యాలను చూసి నగరవాసులు షాక్‌కు గురయ్యారు. వాస్తవానికి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై మలుపులు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ప్రమాదకర రోడ్డుపై వాహనాలు అతి వేగంతో దూసుకెళ్తుంటాయి. ఇక రోడ్డు ఏ మాత్రం నిర్మానుష్యంగా కనిపించినా వందకు మించిన స్పీడ్‌తో వెళ్తుంటాయి. ఇవాళ జరిగిన ప్రమాదానికి ఈ అతి వేగమే కారణం …

అతి వేగంతో దూసుకెళ్లడంతో మలుపు వద్ద డ్రైవర్ కారును కంట్రోల్ చేయలేకపోయాడు. లెఫ్ట్ సైడ్ రెయిలింగ్‌ను కారు ఢీకొట్టి అమాంతం గాల్లో ఎగరుతూ వెళ్లి కింద రోడ్డుపై పడింది. హైదరాబాద్ బయో డైవర్శిటీ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్‌పై వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి కింద రోడ్డుపై వెళ్తున్న మరో కారుపై పడింది. ఆ సమయంలో అక్కడే ఆటోకోసం వేచి చూస్తున్న మహిళ ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందింది. మృతిచెందిన మహిళ సత్యవేణిగా గుర్తించారు. ఈ దుర్ఘటనలో మరో ఆరుగురు తీవ్రగాయాల పాలయ్యారు. దీంతో గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. కింద ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఆరుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో గాయడ్డారు.

అదృష్టం అంటే ఆ అమ్మాయిదే:

మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. అలాగే వచ్చినట్టే వచ్చి మృత్యువు ఎలా తప్పిపోతుందో కూడా ఎవరికీ తెలియదు. హైదరాబాద్ రాయదుర్గం ఫ్లైఓవర్ పైనుంచి ఓ కారు పల్టీకొట్టడంతో రోడ్డులో పోతున్న ఓ మహిళ చనిపోయింది. అంతకంటే విచిత్రంగా ఫ్లైఓవర్ మీదున్న సైన్ బోర్డ్ పైనుంచి కిందపడే సమయంలో కచ్చితంగా ఓ విద్యార్థిని తలపై పడి తల చీలిపోయే పరిస్థితుల్లో ఆ సైన్ బోర్డు నీడచూసి ఆ అమ్మాయి చావుని ఎలా తప్పించుకుందో చూస్తే రాసిపెట్టి ఉంటే మృత్యువు పైనపడ్డా బతికి బైటపడతారనేదానికి ఇదో ఉదాహరణ. క్షణకాలంలో ఆ అమ్మాయి అప్రమత్తత ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడింది.