మెదక్ జిల్లా ఎస్పీగా పని చేస్తున్న చందన దీప్తి 2012 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారిణి. ఈమె సొంత జిల్లా వరంగల్. విద్యాభ్యాసం అంతా చిత్తూరు, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాలలో సాగింది. ఇప్పుడు ఈ IPS అధికారిణి పెళ్లి చేసుకోబోతున్న వరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ ‌రెడ్డికి స్వయానా కజిన్ అవుతాడు.

పేరు బలరామ్‌ రెడ్డి. పుట్టిన స్థలం నెల్లూరు. కడప జిల్లాలో బాల్యం గడిచింది. విద్యాబ్యాసం అంతా విదేశాల్లో జరిగింది. బలరామ్ దాదాపుగా విదేశాల్లోనే వున్నాడు. ఆతిధ్య-నిర్మాణ రంగాలకు సంబంధించిన మాస్టర్స్ డిగ్రీని న్యూజిలాండ్‌లో పూర్తి చేసి ఇక్కడే తెలుగు రాష్ట్రాల్లో హోటల్ అండ్ హాస్పిటాలిటీ రంగంలో స్థిరపడ్డారు.

మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తికి చిన్నప్పటి నుంచి పరిచయస్తుడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అలా ప్రేమ అండ్ పెద్దలు కుదిర్చిన పెళ్లిగా వీరిద్దరి కథ ఇప్పుడు పీటల మీదకు వచ్చింది. సో, ఓవరాల్‌గా రెండు కుటుంబాలు, రెండు వేర్వేరు రంగాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు జీవిత భాగస్వాములు కాబోతున్నారు.

ఇరు కుటుంబాల్లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. పెళ్లికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారన్న వార్త కాబోయే దంపతులిద్దరకీ మరింత సంతోషాన్ని అందిస్తోంది…