వరంగల్ కు చెందిన సుకన్య ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది . భర్త ఎన్ఐటీలో PHD స్కాలర్ . విద్యారంగంలో సాంకేతిక సేవలు అందించాలనే తపన వాళ్లది . ఏ తరహా స్కూల్ పెడితే బాగుంటుందని ఆలోచించారు . చదువుకు టెక్నాలజీని జతచేస్తే బాగుంటుందనుకున్నారు . తల్లిదండ్రులు సైన్స్ , మ్యాథ్ , ఇంగ్లీషుకు ప్రాధాన్యం ఇస్తున్నారు . వైజ్ఞానిక అంశాలపై దృష్టి పెట్టడం లేదని తెలుసుకున్నారు . అందుకే ప్రత్యేకంగా సైన్స్ & ఎలక్ట్రానిక్స్ , రోబో తయారీ లాంటి ఆసక్తికర అంశాలతో సిలబస్ డిజైన్ చేశారు . ఏడాది కిందట ‘ క్రియేటివ్ రోబోటిక్స్ ‘ ఇనిస్టిట్యూట్ నెలకొల్పారు . అనేక సందేహాల మధ్య మొదలైన రోబోటిక్స్ ట్రైనింగ్ ఇప్పుడు విజయవంతంగా నడుస్తోంది . ఏడాది వ్యవధిలో ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు పలు జాతీయ స్థాయి ఈవెంట్లలోనూ పాల్గొన్నారు . నిట్ , వరంగల్ టెక్నోజియాన్ సందర్భంగా ప్రత్యేక ఎగ్జిబిట్ ను ఏర్పాటు చేశారు . గుంటూరులో 2018లో జరిగిన నేషనల్ ఒలంపియాడ్లో ఏడుగురు బహుమతులు గెలుచుకున్నారు .

పిల్లలకు శిక్షణ ఇలా . .

ఏడు దశల్లో రోబోటిక్స్ శిక్షణ ఉంటుంది . వారంలో ఒకరోజు చొప్పున ప్రైమరీ పిల్లలకు శిక్షణ ఇస్తారు . రోబోటిక్స్ పై పూర్తి అవగాహన కల్పిస్తారు . శిక్షణ పూర్తయ్యేసరికి రోబోల తయారీలో విద్యార్థులు పరిణతి సాధిస్తారు . పది సార్లు చదవడం కంటే ఒక్కసారి రాసింది ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది . పుస్తకాల్లో చదివి పరీక్షలో రాసి మార్కులు తెచ్చుకోవడం కంటే చదివిన అంశాలను ప్రాక్టికల్ గా చేసినప్పుడు ఫలితం మెరుగ్గా ఉంటుంది . ఈ విషయాన్ని ‘ క్రియోటివ్ రోబో టిక్స్ ‘ నిరూపిస్తోంది .