చిరంజీవి వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు అంటూ మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే, పదేళ్ల నుండి ఈ శుభవార్త కోసం ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ ఈ వార్త బయటకి రాగానే సంబరాలు చేసుకున్నారు. త్వరలోనే మరో మెగా వారసుడు రాబోతున్నారు అంటూ కేరింతలు కొట్టారు పెళ్ళై ఇన్నేళ్లు గడుస్తున్నా కూడా రామ్ చరణ్ కి పిల్లలు ఎందుకు కలగడం లేదు అంటూ ఆయన మీద ఉపాసన మీద సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్ల్స్ మరియు కామెంట్స్ వచ్చాయి పాపం ఉపాసన ఏ ఇంటర్వ్యూ కి వెళ్లినా ఈ ప్రశ్ననే అడిగేవారు.

పాపం ఆమె ఎంతో ఇబ్బంది పడుతూనే సమాధానం చెప్పేది అలా ఎన్నో అవమానాలు ఎదురుకున్న తర్వాత ఇలాంటి వార్త రావడం అభిమానులకు ఎంత సంతోషంగా ఉంటుందో మాటల్లో వర్ణించలేనిది ఇప్పుడు వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ మరో వార్త ముందుకు వచ్చింది. అదేమిటంటే ఉపాసన కవలపిల్లలకు జన్మని ఇవ్వబోతుందట దానికి సంబంధించిన స్కానింగ్ రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది ఇన్నేళ్లు వేచి చూసినందుకు అభిమానులకు ఈ డబుల్ ధమాకా దొరకడంతో వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.