‌కాజీపేటలో ప్రారంభించాల్సిన రైల్వే పరిశ్రమలకు రెక్కలొచ్చాయి. నిధులు విడుదలైనా భూసేకరణ లో జాప్యంతో పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం అప్పటి యూపీఏ సర్కారు కాజీపేటలో రైల్వే బోగీల(వ్యాగన్‌) తయారీ పరిశ్రమను స్థాపిస్తామని ప్రకటించింది. ఇందుకోసం అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి మమతాబెనర్జీ రూ.196 కోట్లు మంజూ రుచేశారు. తర్వాత కేంద్రం మాట మార్చింది. వ్యాగన్‌ తయారీ కాదు.. బోగీల మరమ్మతు వర్క్‌షా్‌పను నెలకొల్పుతామన్నది. ఈ యూనిట్‌ ప్రారంభానికి కావా ల్సిన 60 ఎకరాలను రాష్ట్ర ప్రభు త్వం సకాలంలో సేకరించలేకపోయింది. దీంతో ఈ యూనిట్‌ను ఏపీలోని విజయనగరానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

రైల్వే పీరియాడికల్‌ ఓవరాలింగ్‌ యూనిట్‌ (పీవోయూ)పైనా అదే జాప్యం నెలకొంది. ఈ యూనిట్‌కు కేంద్రం 2016-17 బడ్జెట్‌లో రూ.188 కోట్లు మంజూరు చేసింది. 2018-19, 2019-20ల్లో రూ.10 కోట్ల చొప్పున కేటాయించింది. ఈ ప్రాజెక్టు కోసమూ రాష్ట్రప్రభుత్వం 150.05 ఎకరాలను రైల్వే శాఖకు సకాలంలో అప్పగించలేదు. మెట్టుగుట్ట సమీపంలోని అయోధ్యపురంలో పీవోయూను నిర్మించాల్సి ఉండగా.. అక్కడ రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భూములున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖకు రూ.45.03 కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ.18 కోట్లు బయానాగా ఇచ్చింది. మిగతా మొత్తాన్ని చెల్లించాకే ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకుని, రైల్వే శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. ఏళ్ల తరబడి ఆ తంతును పూర్తిచేయలేకపోవడంతో ఈ యూనిట్‌ను ఒడిసాకు తరలించే ఏర్పాట్లు సాగుతున్నాయి.

కాజీపేట వ్యాగన్‌రిపేర్‌ వర్క్‌షా్‌ప తోపాటే కేంద్రం ఏపీలోని వెలగపూడి లో ఎలక్ట్రికల్‌ వర్క్‌షా్‌పను ప్రకటించి రూ.300 కోట్లు కేటాయించింది. నిర్మాణ పనులు పూర్తయిన ఈ వర్క్‌షా్‌పను వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. కాజీపేటలో మాత్రం వచ్చిన పరిశ్రమలు వచ్చినట్లు తిరుగుటపా కడుతున్నాయి. 40 ఏళ్ల క్రితం కోచ్‌ ఫ్యాక్టరీ అంతే , కాజీపేటకు రైల్వే ఫ్యాక్టరీల విషయంలో అన్యాయమే జరుగుతోంది. 40 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఇక్కడ కోచ్‌ ఫ్యాక్టరీ ని నిర్మిస్తామని ప్రకటించింది. తర్వాత ఆ యూనిట్‌ పంజాబ్‌కు తరలించింది. ఓరుగల్లుకు చెందిన రాజకీయ నాయకుల్లో, ప్రజాప్రతినిధుల్లో పట్టింపే లేకపోవడంతో ఇక్కడ నెలకొల్పే పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. పార్లమెంట్‌లో గళమెత్తాల్సిన ఎంపీలు ఆ దిశలో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రైల్వే ప్రాజెక్టులొస్తే స్థానిక యువతకు ఉద్యోగాలు దొరుకుతాయన్న ధ్యాస వారిలో లేదు…