‘‘కొండ’’ను కూడా ఢీకొట్టి నుగ్గు చేసే దమ్మున్న నేత ధర్మారెడ్డి

· రెండోసారి ధర్మారెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం నియోజకవర్గానికి ఉంది

· గుండా రాజ్యం, రౌడీరాజకీయం కావాలో…ప్రశాంత పరకాల కావాలో నిర్ణయించుకోవాలి

· ధర్మారెడ్డి పట్టుదల వల్లె పరకాలకు టెక్స్ టైల్ పార్క్ వచ్చింది

· వరంగల్ లో 50 కోట్లరూపాయలను సీసీ రోడ్ల కోసం పట్టుకొచ్చిన ఏకైక ఎమ్మెల్యే ధర్మారెడ్డి

· టిఆర్ఎస్ రెండు విడతల ప్రచారం పూర్తి చేసుకుంటుంటే…కాంగ్రెస్ సీట్ల కొట్లాటలోనే ఉంది

· వరంగల్ లోని దొంగలంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు

పరకాల నియోజక వర్గంలో గుండా రాజ్యం, రౌడీ రాజకీయం, ఆడబిడ్డల పుస్తెలు తెంపే దోపిడి, భూ కబ్జాలు, కొట్లాటలు చేసే కాంగ్రెస్ కావాలో, అభివృద్ధి కోసం పట్టుదలతో పనిచేసి, ప్రశాంతమైన పరకాల కోసం కృషి చేసే టిఆర్ఎస్ ధర్మారెడ్డి కావాలో ప్రజలు నిర్ణయించాలని ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రజలను కోరారు.

కొండను కూడా ఢీకొట్టి నుగ్గు, నుగ్గు చేసే దమ్మున్న నేత ధర్మారెడ్డియే అని కడియం శ్రీహరి అన్నారు. పరకాల నియోజక వర్గం గజ్వేల్, సిద్దిపేటకు ధీటుగా అభివృద్ధి కావాలంటే చల్ల ధర్మారెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన అవసరం నియోజక వర్గ ప్రజలకు ఉందన్నారు. చల్లా ధర్మారెడ్డి నిత్యం నియోజక వర్గ అభివృద్ధి కోసం సిఎం కేసిఆర్, మంత్రుల చుట్టూ తిరుగుతూ పనిచేస్తారని కితాబునిచ్చారు.

ధర్మారెడ్డి అలుపెరుగని పట్టుదల వల్లే పరకాలకు కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ వచ్చిందన్నారు. కేవలం 45 రోజుల్లో 1200 ఎకరాల భూమిని చిన్న గందరగోళం కూడా లేకుండా సేకరించిన సమర్థ నేత ధర్మారెడ్డి అన్నారు.