పెళ్లైన మహిళలు గూగుల్ లో ఏం సెర్చ్ చేస్తున్నారో పలు అధ్యయనాలు భయటపెట్టాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం: ఆడపిల్ల జీవితం అనేది పెంచిన తల్లిదండ్రుల వద్ద కొంత కాలం వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత జీవితం మొత్తం తన భర్తతోనే ఉంటుంది. ఇలా పెళ్లి గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మహిళలు. భర్తతో జీవితం ఎలా ఉండబోతోంది అత్తవారింట్లో ఎలా ఉండాలి అనే కోణంలో ఎక్కువగా ఆలోచిస్తుంటారు. పెళ్లి అయిన తర్వాత అత్తారింట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి భర్త, మామ, అత్తలే ప్రపంచంగా బతుకుతారు. ఈ మేరకు కుటుంబ సభ్యులతో మంచి పేరు సంపాదించుకోవడానికి మహిళలు చాలా కష్టపడుతుంటారు. అయితే పెళ్లి కాకముందు కంటే పెళ్లి తర్వాత మహిళలు గూగుల్ లో సెర్చ్ చేయడం అనేది ఎక్కువగా ఉంటోందని పరిశోధకలు గుర్తించారు. ఈ సర్వేలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. అవేంటంటే.? భర్తకు ఆకర్షణీయంగా కనపడటానికి భార్యలు కోరుకుంటారు. ఇలా భర్తలకు అందంగా ఆకర్షణీయంగా కనపడాలంటే ఏం చేయాలి అనే విషయాను గూగుల్ లో ఎక్కువగా వెతుకుతున్నారని పలు అధ్యయనాలు తెలిపాయి. పెళ్లైన తర్వాత భర్త మనస్సు ఎలా గెలవాలి.? భర్తతో ఎలా ఉండాలి.? ఎలా మెలగాలి అనే విషయాలను కూడా భార్యలు సెర్చ్ చేస్తున్నారట. భర్త యొక్క మనస్సును ఆకట్టుకోవడానికి ఏం చేయాలి అనే కోణంలో ఎక్కువగా గూగుల్ చేసేస్తున్నారు.

అత్తారింటికి వెళ్లిన తర్వాత భర్తతో పాటు అతడి కుటుంబసభ్యులు కూడా ఉంటారు. వారితో ఎలా సన్నిహితంగా ఉండాలి.? వాళ్ల మనసులను ఎలా గెలుచుకోవాలి అనే విషయాలను కూడా మహిళలు తెగ వెతికేస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరినీ ఆకర్షిస్తూ అందరికీ నచ్చే వంటకాలు చేసే మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. వివాహం ముందు పుట్టింటిలో ఉన్నప్పుడు ఎలాంటి బాధ్యతలు ఉండవు. పెళ్లైన తర్వాత అలా ఉండదు. బరువు, బాధ్యతలు అనేవి పెరుగుతాయి. వాటిని ఎలా చూసుకోవాలి. కుటుంబపోషణకు తమ వంతు ఎలా కృషి చేయాలనే విషయాలను కూడా గూగుల్ లో మహిళలు శోధిస్తున్నారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. భర్తలకు కొన్ని అభిరుచులు ఉంటాయి. వాటిని తెలుసుకొని అందుబాటులో ఉంచితే భార్యభర్తలు సంతోషంగా ఉంటారు. అయితే పెళ్లైన చాలామంది మహిళలకు భర్తల అభిరుచులు ఏంటో తెలియదు. అయితే వీటికి సంబంధించి కూడా పెళ్లైన మహిళలు భర్తలకు ఏదంటే ఇష్టం దేనిని ఎక్కువగా ప్రేమిస్తారు అనే విషయాలను గూగుల్ చేసేస్తున్నారు.