కమిషనరేట్ పరిధిలో గంజాయి అమ్మకాలు, వినియోగాన్ని కట్టడి చేస్తూ ప్రతి పోలీస్ అధికారి తమ వ్యక్తిగత బాధ్యతగా విధులు నిర్వహించాలని సెంట్రల్‌ జోన్ డిసిపి పుష్పా రెడ్డి బ్లూకోల్ట్స్ మరియు పెట్రొకార్ సిబ్బందికి పిలుపునిచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి పిలుపు నందుకోని సెంట్రల్ జోన్ పరిధిలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి విక్రయాలు, వినియోగాన్ని నియంత్రణ చేయడంలో భాగం సెంట్రల్ జోన్ డిసిపి పెట్రోకార్, బ్లూ కోల్ట్స్ సిబ్బందితో కమిషనరేట్ కార్యాలయములో గురువారం సమావేశమయ్యారు.

ఈ సందర్బంగా డిసిపి మాట్లాడుతూ: ప్రతి పెట్రోకార్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది తమ పరిధిలో గంజాయి అమ్మకాలు, వినియోగం జరిగే ప్రాంతాలను గుర్తించాలని అదే విధంగా గ్రామీణా ప్రాంతాల్లో గంజాయి సాగుపై కూడా దృష్టి పెట్టాలని. ఇన్ఫార్మర్ వ్యవస్థను బలోపేతం చేయాలని. ప్రజల్లో మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే నష్టాలను ప్రజలకు అవగాహన కల్పించడంతో, ప్రతి ఒక్కరు సామాజిక ఉద్యమం ముందుకు తీసుకపోవాలి.