ఉదయం నిద్రలేచిన ఆ ఇంటి వారు దుప్పట్లు మడతపెడుతుండగా భారీ విష సర్పం ప్రత్యక్షమైంది. దాంతో ఒక్కసారిగా వారు ఉలిక్కిపడ్డారు. ఈ షాకింగ్‌ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఒక మహిళ ఉదయం నిద్ర లేచి బెడ్‌షీట్ తీస్తుండగా తన మంచంలో 6 అడుగుల పొడవైన విషపూరిత పాము కనిపించింది. పాము కనిపించగానే భయంతో అరుస్తూ ఇంట్లోంచి బయటకు పరుగులుతీసింది మహిళ. క్వీన్స్‌లాండ్‌కు చెందిన ఒక మహిళ తన మంచం మీద ఆరు అడుగుల పొడవైన విషపూరిత పామును చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆ పాము చూసేందుకు భారీ పొడవుతో గోధుమరంగులో కనిపించిందని మహిళ వాపోయింది. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించింది. అయితే, రాత్రంతా ఆ పాము అక్కడే ఉందా అనేది ఇప్పుడు ఆ మహిళకున్న పెద్ద సందేహం.
స్నాక్ క్యాచర్ జాకరీ రిచర్డ్ వెంటనే ఆమె ఇంటికి చేరుకున్నారు.

అప్పటికీ అక్కడే మంచంపైనే ఉన్న పామును బందించాడు. సురక్షితంగా దాన్ని సమీప అడవిలో విడిచిపెట్టాడు. అయితే, బయటవాతావరణంలో అధికవేడి కారణంగా ఇంట్లోకి ప్రవేశించి ఉండొచ్చునని, బెడ్‌రూమ్‌ చల్లగా ఉండటంతో అది అక్కడే హాయిగా పడుకుని ఉంటుందని స్నేక్‌ చెప్పాడు. పామును పట్టుకున్న తర్వాత, రిచర్డ్ దానిని సురక్షితమైన ప్రాంతంలో సమీప ఇళ్లకు దూరంగా పొదలోకి వదిలాడు. అయితే, పట్టుబడిన పాము తూర్పు బ్రౌన్ ప్రపంచంలో రెండవ అత్యంత విషపూరితమైన పాముగా చెప్పాడు. దీని విషంలో శక్తివంతమైన న్యూరోటాక్సిన్ ఉంటుంది. ఈ పాము ఎవరినైనా కాటేస్తే, దాని విషం గుండె, ఊపిరితిత్తులను స్తంభింపజేస్తుంది. దాంతో ఆ వ్యక్తి ఊపిరాడక మరణిస్తాడు. ఆస్ట్రేలియాలో పాము కాటు వల్ల అత్యధిక మరణాలు సంభవించాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..