పెళ్లి భోజనంలో మాంసాహారం పెట్టలేదనో లేదా చికెన్, మటన్ సరిపోను వడ్డించలేదనో జరిగిన గొడవల గురించి విన్నాం. కానీ ఉత్తర్‌ప్రదేశ్ భాగ్‌పత్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో మాత్రం పన్నీర్ కోసం రచ్చ రచ్చ చేశారు. పెళ్లి కొడుకు కుటుంబం తమను పన్నీర్ వడ్డించలేదని బాహాబాహీకి దిగారు. దీంతో అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. చొక్కాలు చిరిపోయేలా పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు.

ఈ ఘటనలో వెయిటర్‌పై విచక్షణా రహితంగా దాడి జరిగింది. దీంతో అతను రోడ్డుపై అచేతన స్థితిలోపడిపోయాడు. అయినా అతడ్ని ఎవరూ పట్టించుకోలేదు, పెళ్లి వేడుకలో జరిగిన ఈ గొడవకు సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌ గా మారింది. పన్నీరు కోసం ఇంతలా కొట్టుకోవడం చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.