హన్మకోండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గత నెల 19వ తేదిన 9నెలల చిన్నారిపై ఆత్యాచారం, హత్యకు సంబంధించిన కేసులో నిందితుడిపై నేరం రుజువయ్యే రీతిలో దర్యాప్తు పూర్తి కానున్నదని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా. వి.రవీందర్‌ శుక్రవారం వెల్లడించారు.

ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు చేపట్టిన దర్యాప్తు తీరుపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ వివరాలను వెల్లడిస్తూ, నేరానికి పాల్పడిన నిందితుడు పోలేపాక ప్రవీణ్‌ను సంఘటన జరిగిన రోజు అరెస్టు చేయడంతో పాటు రిమాండ్‌ తరలించడం జరిగిందని. అదే విధంగా సంఘటన జరిగిన తీరును తెలుసుకోనేందుకుగాను నిందితుడుని కోర్టు అనుమతితో పోలీస్‌ కస్టడీ తీసుకోని విచారించామని. నిందితుడు పాల్పడిన నేరాన్ని నిరూపించేందుకు గాను సి.సి కెమెరాల దృశ్యాలను సేకరించడంతో పాటు, నిందితుడికి డి.ఎన్‌.ఎ పరీక్ష నిర్వహించడం జరిగిందని. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గుర ప్రత్యక్ష సాక్ష్యులతో పాటు మరో 35మంది సాక్ష్యులను పోలీసులు విచారించారని.

అధే విధంగా చిన్నారి మరణానికి గల కారణాలను నిర్థారించేందుకు అవసరమయిన పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిందని. ఈ సంఘటనకు సంబంధించి ఛార్జ్‌షీటును పూర్తిచేసి త్వరలో కోర్టుకు అందజేయబడుతుందని పోలీస్‌ కమిషనర్‌ తెలపడంతో పాటు, ఇకపై ఇలాంటినేరాలకు పాల్పడితే తప్పకుండా నేరస్థులకు శిక్షపడుతుందనే రీతీలో ఈ కేసును దర్యాప్తు చేపట్టడం జరుగుతోందని పోలీస్‌ కమిషనర్‌ వెల్లడించారు…