ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు, వారి కెమెరాలు ఫోటో తీసి చలాన్ పంపినల్లే జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా వడ్డింపుకు దిగనున్నారు. చెత్తవేసినా, ఫ్లెక్సీలు పెట్టినా, రోడ్ల పక్క మలమూత్రాలు విసర్జించినా క్లిక్ కొట్టి ఆన్‌లైన్ ద్వారా జరిమానా వసూలు చేయనున్నారు. ట్రాఫిక్ చలాన్ల మాదిరే తాము కూడా పారిశుద్ధ్య నిబంధనలను ఉల్లంఘిస్తే చలాన్లు వేస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.

చెత్త, మూత్రవిసర్జన తదితరాలకు సంబంధించి ఒక్క నెలలోనే 1085 నోటీసులు పంపి రూ.1.50 కోట్ల మేర జరిమానాల వేశామని ఆయన వెల్లడించారు. ‘చలానా పడిన తర్వాత 24 గంటల్లోగా చెత్తను తీసివేయకుంటే జరిమానా పెరుగుతుంది. ప్రజల నుంచి డబ్బులు రాబట్టడం మా ఉద్దేశం కాదు.

క్లీన్ సిటీనే మా లక్ష్యం. రీసైక్లథాన్ ఆపరేషన్ కింద ఇప్పటివరకు ఇళ్ల నుంచి 235 టన్నుల నిరుపయోగ సామగ్రిని సేకరించాం. వచ్చే శుక్రవారానికల్లా సిటీలోని మొత్తం ఫ్లెక్సీలను పీకేస్తాం. తర్వాత ఎవరైనా ఫ్లెక్సీ పెడితే ఫొటో తీసి ఆన్‌లైన్ ద్వారా జరిమానా వేస్తాం అని తెలిపారు.