టిక్ టాక్ లతో కాలక్షేపం చేస్తున్న వరంగల్ తెరాస MP గన్‌మెన్లు…

వరంగల్‌: టీఆర్ఎస్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ బండ ప్రకాష్‌ గన్‌మెన్లు ఆయన అల్లుడితో కలిసి టిక్‌టాక్‌ల్లో మునిగి తేలడం కలకలం రేపుతోంది. వరంగల్ రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్‌ అల్లుడు జగన్‌కు గన్‌మెన్లుగా యాక్షన్ చేస్తూ వీడియోలకు ఫోజులిచ్చారు. అనంతరం ఆ వీడియోలను జగన్ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. పులిచింతల ప్రాజెక్టు సందర్శిస్తున్న క్రమంలో ఎంపీ భద్రతను గాలికి వదిలేసి వీడియోలు చిత్రీకరణలో మునిగిపోయారు.

ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.. వీరిని సస్పెండ్ చేసి, ఉన్నతాధికారులు అందరికి ఒకే న్యాయం అని చాటాలి అని ప్రజలు కోరుతున్నరు…Video: ?