• టీటీడీ తెలంగాణ సలహామండలి వైస్ ప్రెసిడెంట్‌గా దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి
  • హిమాయత్‌‌నగర్, టీటీడీ దేవాలయంలో పదవీ బాధ్యతల స్వీకారం
  • తెలుగు రాష్ట్రాల నుంచి వెల్లువెత్తుతున్న అభినందనలు

సెప్టెంబర్ 11 : టీటీడీ తెలంగాణ సలహామండలి (LAC) వైస్ ప్రెసిడెంట్‌గా దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నవంబర్ 11 సాయంత్రం హిమాయత్ నగర్‌లోని టీటీడీ దేవాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో కరణ్ రెడ్డి టీటీడీ తెలంగాణ సలహామండలి వైస్ ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ ప్రాంత టీటీడీ ఆలయాలు, సమాచార కేంద్రాల సలహా సంఘానికి ఉపాధ్యక్షుడిగా కరణ్ రెడ్డి వ్యవహరిస్తారు.. హిందూ ధార్మిక పరిరక్షణకు చేస్తున్న కృషికిగాను కరణ్ రెడ్డికి ఈ బాధ్యతలను టీటీడీ అప్పగించింది.

కాగా టీటీడీ బోర్డ్ హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, ముంబై నగరాలకు సంబంధించి టీటీడీ స్థానిక సలహామండలి(Lac)లను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. టీటీడీ బోర్డ్ ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ పాలనా విభాగం జేఈవో బసంత్‌కుమార్ హైదరాబాద్ స్థానిక సలహామండలిని ఏర్పాటు చేస్తూ నవంబర్ 1న జీవో జారీ చేశారు. ఈ మేరకు ఇవాళ కరణ్ రెడ్డి టీటీడీ సలహామండలి ఉపాధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ ప్రాంత టీటీడీ సలహామండలిలో వైస్ ప్రెసిడెంట్ కరణ్ రెడ్డితో సహా మొత్తం 20 మంది సభ్యులు ఉన్నారు. కరణ్ రెడ్డిలోని కార్యదక్షత, ధార్మిక సేవా గుణాన్ని గుర్తించిన టీటీడీ ఆయనకు తెలంగాణ ప్రాంత స్థానిక సలహామండలి వైయస్‌ ప్రెసిడెంట్‌ పదవిని కట్టబెట్టింది.

ఈ సందర్భంగా కరణ్ రెడ్డి మాట్లాడుతూ ఏడుకొండలవాడికి సేవ చేసే భాగ్యం కల్పించిన ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ మంత్రివర్యులు కేటీఆర్‌కు, విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారికి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారికి, టీటీడీ బోర్డ్ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ బోర్డ్ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సార‌‍థ్యంలో తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, తెలంగాణ రాష్ట్రంలో టీటీడీ దేవాలయాలు, కల్యాణమండపాల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా కరణ్ రెడ్డి తెలిపారు. టీటీడీ తెలంగాణ సలహామండలి వైస్ ప్రెసిడెంట్‌గా పదవీబాధ్యతలు చేపట్టిన దరువు ఎండీ కరణ్ రెడ్డికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.