చిన్నారి ఇంట్లో ఆడుకుంటూ టీవీ కేబుల్‌ను లాగడంతో

ఇంట్లో ఆడుకుంటూ టీవీ దగ్గరకెళ్లిన బాలుడు టీవీ కేబుల్‌ను లాగగా ! టీవీ అతని తలపై పడి, తీవ్ర గాయాలయ్యాయి. కోమాలోకి వెళ్లిన బాలుడిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మరణించాడు. వివరాలు: రెంజల్ మండలం వీరన్నగుట్ట తండాకు చెందిన హర్ష అనే చిన్నారి ఇంట్లో ఆడుకుంటూ టీవీ కేబుల్‌ను లాగడంతో టీవీ అతని తలపై పడింది.

పనిలో ఉన్న తల్లి చిన్నారిని గమనించగా తీవ్రగాయాలై, స్పందన లేకుండా ఉన్నాడు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని వెంటనే నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. చిన్నారి మరణంతో అతని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. ఈ పరిస్థితి ఏ తల్లిదండ్రులకూ రాకూడదని వారు ఏడుస్తూ అన్నారు…