మొబైల్ యువతను పక్కదారి పట్టిస్తోంది. ముఖ్యంగా చిన్న పిల్లలపై దీని ప్రభావం తీవ్రంగా పడి వారి జీవితాలను నాశనం చేస్తోంది. మొబైల్ కు అడిక్టయిన వారెందరో చేతిలో అది లేకపోయేసరికి పిచ్చోళ్లుగా మారుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు వరకు వెళుతున్నారు. తాగాగా మొబైల్ మాయలో పడి 9 ఏళ్ల చిన్నారి బలికావడం ఆవేదనను మిగిల్చింది. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి టిక్ టాక్ వేదిక దారి చూపింది. దీని ద్వారా ఎందరో ఉన్నతస్థాయికి వెళ్లారు. అయితే దీనిని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయడం ద్వారా రీల్స్ ను ఎంచుకున్నారు. చాలా మంది సినీ ఫీల్డుపై ఇంట్రెస్టు ఉన్నవారు రీల్స్ చేస్తూ తమ ప్రతిభను బయటపెడుతున్నారు. అయితే తమిళనాడుకు చెందిన 9 ఏళ్ల చిన్నారికి రీల్స్ చేయడం అలవాటైపోయింది. చదువును పక్కనబెట్టి ఆమె దీనికి అడిక్ట్ అయింది. ప్రతిరోజు ఏదో ఒక వీడియో చేసి పోస్టు చేస్తూ వచ్చింది. ఇది గమనించిన తండ్రి మందలించాడు. దీంతో ఆ బాలిక ఏకంగా ప్రాణాలే తీసుకుంది.

తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలో ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. తిరువల్లూర్ కు చెందిన కృష్ణ మూర్తి అనే వ్యక్తికి 9 ఏళ్ల ఓ కూతురు ఉంది. ఆమె నిత్యం కొన్ని వీడియోలు క్రియేట్ చేస్తూ ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేసేది. దీంతో ఆమెను ఇన్ స్టా క్వీన్ అని పేరు తెచ్చకుంది. అయితే సోమవారం ఆమె తమ అమ్మమ్మ ఇంటి వద్ద ఆడుకుంటోంది. అయితే ఆటలు వద్దు చదువుకోవాలని సూచించారు. ఇదే సమయంలో ఆమె కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారు. అయితే రాత్రి 8 గంటలకు ఇంటికి చేరుకోగానే తలుపులు వేసి ఉన్నాయి. తలుపులను ఎంత కొట్టినా డోర్ తెరవలేదు. దీంతో వాటిని బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా బాలిక ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. దీంతో అమెను చూసిన తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిత్యం రీల్స్ చేసే ఆ బాలికను తండ్రి మందలించాడనే ఉరివేసుకొని చనిపోయింది కావొచ్చు అని అనుకుంటున్నారు.