తెలంగాణ రాష్ట్రంలో 2021లో మద్యం అమ్మకాల జోరు పరంపర కొనసాగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి 2021 సంవత్సరం విక్రయాలు అత్యధికమని చెప్పొచ్చు. 2021లో అంతకు ముందు ఏడాది కంటే దాదాపు రూ.కోట్లకుపైగా అధికంగా మద్యం అమ్మకాలు జరగడం సరికొత్త రికార్డు. రాష్ట్రం ఏర్పాటైన తరువాత 2016లో రూ.14,075 కోట్ల విలువైన 2.72 కోట్ల కేసుల లిక్కర్‌, 3.42 కోట్ల కేసుల బీరు అమ్ముడు పోయింది.

2020 సంవత్సరంలో తీసుకుంటే రూ.25,601.39 కోట్ల విలువైన 3.18 కోట్ల కేసులు లిక్కర్‌, 2.93 కోట్ల కేసుల బీరు విక్రయాలు జరిగాయి. అదే 2021 సంవత్సరంలో తీసుకుంటే 30,222 కోట్ల విలువైన 3.69 కోట్ల కేసుల లిక్కర్‌, 3.26కోట్ల కేసుల బీరు విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే గత సంవత్సరం కంటే 4,621 కోట్లు విలువైన మద్యం ఎక్కువ అమ్ముడు పోయింది.