నానమ్మ నేనూ నాన్న దగ్గరకు వెళ్లిపోతున్నా అమ్మ, నాన్న, అక్కను వదిలి ఉండలేను. ఈ మంట, నొప్పి భరించలేకపోతున్న. బతికి ఉన్నా కూడా అమ్మా నాన్నా అక్క లేని ఈ లోకం లో ఉండలేను. నువ్వు, అత్త ఉన్న అమ్మమ్మ వాళ్ళు ఉన్న ఈ ఒంటరితనం భరించలేను. నీకు నాన్నకు మధ్య ఉన్న లెక్కల చిక్కుల్లో మేమంతా బలయ్యాము. నీకు నీ కూతురు పై ఆస్తి ఇవ్వాలన్న ప్రేమ నాన్న కూడా ఫీలై మాకు ఆస్తి ఉండలనుకున్నారేమో. అందు కె మీకు మీకు మధ్య గొడవలు. నాన్న నిర్ణయం మంచిదో కాదో చెప్పే వయసు కాదు నాది. నేను జడ్జి ని కాదు నానమ్మ అందుకే నేనేమి చెప్పలేను. పెద్ద మనుషులు పంచాయతీ లో ఏమి చేశారో నాన్న చాలా బాధపడి ఈ నిర్ణయం తీసుకున్నారు.

తను ఒక్కడినే వెళ్లిపోవలనుకున్నారట ముందు. తర్వాత మా గురించి ఆలోచించి మమ్మల్ని తీసికెళ్లిపోయారు నేను వెళ్ళటం రెండు రోజులు ఆలస్యమైంది. బై నానమ్మ వెళుతున్న. అమ్మ, నాన్న, అక్క నా కోసం ఎదురు చూస్తున్నారు. నా కోసం రెండు రోజులు నన్నుబతికించాలని కృషి చేసిన డాక్టర్ అంకుల్, అంటి, నర్స్ అంటి మీకు థాంక్స్. దేవుడికి కూడా థాంక్స్ ఎందుకంటే నాకు బాధ నుండి విముక్తి కలిగించి అమ్మ నాన్న దగ్గరకు తీక్సుకెళుతున్నందుకు…