• తెలంగాణ రాష్ట్ర అవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళా బద్రతా, సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలి సారిగా అడిషనల్ డైరెక్టర్ జనరల్ పోలీస్ అధికారి స్థాయి ఆధ్వర్యంలో “ఉమెన్ సేఫ్టీ వింగ్”ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మహిళల ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టింది.
    ఈ మహిళా బద్రతా విభాగంలో షీ టీమ్స్, భరోసా, షీ భరోసా సైబర్ ల్యాబ్, మానవ అక్రమ రవాణా నివారణ తో పాటు ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ప్రవేశపెట్టి సమర్దవంతంగా అమలు చేస్తోంది. మహిళలు ఎదురుకుంటున్న పలు సమస్యలపై వారు ప్రత్యేక్షంగా గాని, పరోక్షంగా గాని భరోసా కేంద్రాలలో ఫిర్యాదు చేసుకొనేందుకు అవకాశం కల్పించింది.

దీనిలో భాగంగా 2021 సంవత్సరంలో మొత్తం 5145 ఫిర్యాదులు అందగా వాటిని సమర్దవంతంగా పరిష్కరించడం జరిగింది. మహిళలు సమాజంలో ఎదురుకుంటున్న పలు సమస్యలపై వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారీలో భరోసా కల్పించె దిశగా రాష్ట్రంలో 6 భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, వికారాబాద్, వరంగల్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేటలో ఏర్పాటు చేసిన ఈ భరోసా కేంద్రాలు విజయవంతంగా నడుస్తున్నాయి. వీటితోపాటు కొత్తగా మేడ్చల్ , మాల్కాజ్ గిరి, మెదక్ , ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో ను ఏర్పాటు చేసేందుకు పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుంది. అదే విధంగా హైదరాబాద్ పాత బస్తీ, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనరేట్ల పరిదిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది.