ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మంచు కారణంగా ఇటీవల కాలంలో అక్కడక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా మాత్రం ఖమ్మం జిల్లాలో బుధవారం ఊహించని రోడ్డు ప్రమాదం జరిగింది. వైరా మండలం పాలడుగు గ్రామం మీదగా ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే ఎదురుగా ఓ లారీ ఎదురొచ్చింది. ఇదే సమయంలో ఆ లారీని ఆర్టీసీ బస్సు డ్రైవర్ తప్పించబోయాడు.

ఇక అదుపు తప్పి ఆ ఆర్టీసీ బస్సు పక్కనే ఉన్న ఇంట్లోకి సగానికిపైగా దూసుకెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు, గ్రామస్తులు బస్సులో ఇరుకున్నవారిని బయటకు తీశారు. అయితే ఈ ప్రమాదంలో ఆ బస్సు డ్రైవర్ తో పాటు కొంతమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గాయపడిని వారిని గ్రామస్తులు చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనలో లారీతో పాటు బస్సు అధిక శాతం ధ్వంసమవ్వడం విశేషం. ఈ ప్రమాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంతో తెలియజేయండి.