ఆర్టీసీ సమ్మెను విరమించాలని జేఏసీ నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని జేఏసీ ఛైర్మన్ అశ్వద్ధామరెడ్డి కోరారు. హైకోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం కూడా కోర్టు తీర్పును గౌరవించి కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని చెప్పారు.

విధుల్లో చేరేటప్పుడు ఎలాంటి సంతకాలు కార్మికులు పెట్టరని కూడా అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. విధుల్లో చేరిన కార్మికులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కూడా అశ్వద్ధామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ జేఏసీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

కార్మికులు విధుల్లో చేరే వాతావరణం ప్రభుత్వం కల్పించాలని ఆయన కోరారు. విధుల్లోకి వెళితే కార్మికులు కేవలం డ్యూటీ ఛార్ట్ ల పైనే సంతకాలు పెడతారన్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.