హైదరాబాద్ : ఆయుర్వేద విద్యార్థుల ధర్నా ఘటనపై సౌత్ జోన్ డీసీపీ అంబర్ కిశోర్‌ఝా స్పందించారు. చార్మినార్‌లోని యునానీ ఆస్పత్రిని ఎర్రగడ్డకు తరలించడాన్ని నిరసిస్తూ గత కొద్ది రోజుల నుంచి యునానీ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే. అయితే ఇవాళ విద్యార్థులు తమ ఆందోళనలను ఉద్ధృతం చేశాం. దీంతో విద్యార్థులను బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించే క్రమంలో అక్కడ మఫ్టీలో ఉన్న ఓ పోలీసు ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె కాళ్లను తొక్కి, గోళ్లతో గట్టిగా గిచ్చాడు. ఆ బాధ భరించలేని సదరు విద్యార్థిని గట్టిగా అరిచి కేకలు వేసింది. కానిస్టేబుల్ అనుచిత ప్రవర్తనపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్‌పై తగిన చర్యలు తీసుకుంటామని డీసీపీ అంబర్ కిశోర్‌ఝా స్పష్టం చేశారు. వీఐపీలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. భద్రతలో భాగంగానే ఇవాళ్టి ఘటన జరిగింది. కానిస్టేబుల్ ఘటన దృశ్యాలను టీవీల్లో ప్రసారం చేయొద్దని మీడియా ప్రతినిధులను డీసీపీ కోరారు…