సమ్మక్క తన కుటుంబ సభ్యులతో తన పుట్టినిల్లు అయిన వెంకట్రావుపల్లికి వలస వెళ్లింది. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కూడా గ్రామాన్ని వదిలి జమ్మికుంటలో ఉంటున్నారు. సమ్మక్క కుటుంబం రెండు నెలల క్రితం తిరిగి స్వగ్రామమైన రంగాపూర్‌కు వచ్చింది. ఈనెల 12న కార్తీక పౌర్ణమి కావడంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు నోముల కోసం రంగాపూర్ వచ్చారు.

అప్పటి నుంచి వీరి కుటుంబాల మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. సమ్మక్క ఇంటి ముందు ఉండగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను రోడ్డుపైకి లాక్కొచ్చి పిడి గుద్దులు కురిపించడంతో సొమ్మసిల్లి పడిపోయింది. శ్రీనివాస్ పక్కనే ఉన్న బండరాయితో సమ్మక్క తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆ వెంటనే నిందితులు హుజూరాబాద్ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయారు.

టౌన్ సీఐ మాధవి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బొడ్డు శ్రీనివాస్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు…