నర్సంపేటపై గులాబి జెండా ఎగరవేసిన పెద్ది సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందా ? అనే ఆశలు ఈ ప్రాంత ప్రజల్లో మెదులుతున్నాయి . సార్వత్రిక ఎన్నికల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నర్సంపేటలో గెలిచిన ఏ పార్టీ అభ్యర్థికి కూడా మంత్రి పదవి రాలేదు . పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితునిగా ఉంటూ వారి కుటుంబ సభ్యుల్లో ఒకడిగా మెదులుతూ వచ్చారు . ఈ క్రమంలో సుదర్శన్ రెడ్డికి 2014లో ఎమ్మెల్యే సీటు వచ్చినప్పటికీ ఓటమిని చవిచూశారు, అయినప్పటికీ కేసీఆర్ పెద్దికి నామినేటెడ్ పదవి అయిన పౌరసరఫరాల సంస్థ చైర్మన్ నియమించారు . ఈ పదవిని సమర్థవంతంగా నిర్వహించిన , పెద్దికి ఈ సారి ఎన్నికల్లో టిక్కెట్ వరించడం అదేవిధంగా గెలవడం నర్సంపేటకు ఒక చరిత్రగా చెప్పవచు. కాగా టీఆర్ఎస్ ప్రభుత్వం గత కేబినెట్లో నలుగురు మంత్రులు , స్పీకర్ ఓడిపోవడంతో వారి స్థానాలలో మంత్రి పదవులు ఎవరికి వస్తాయో అనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో సమర్థుడైన పెద్ది సుదర్శన్ రెడ్డికి కేసీఆర్ ఏదో ఒక మంత్రి పదవి ఇస్తాడనే నమ్మకం ఉంది .

ఒక వేళ పెద్దిని మంత్రి పదవి వరిస్తే నర్సంపేట చరిత్రలో మొదటి మంత్రిగా పేరుగాంచి పేటకు బుగ్గ కారుతో వచ్చే అవకాశం ఉంటుంది . ఈ అవకాశం రావాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు .