పెళ్లి కావట్లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్ట పరిధిలో ఉన్న ఫారూఖ్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం: ఫారూఖ్‌నగర్‌కి చెందిన మహమ్మద్ యూసుఫ్(26) స్థానికంగా బౌన్సర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లి సంబంధాలు కుదరట్లేదని కొంతకాలంగా బెంగ పెట్టుకున్నాడు. ఇదే క్రమంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టమ్ నిర్వహించారు. పెళ్లి సంబంధాలు కుదరట్లేదన్న మనస్తాపంతోనే షరాఫ్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు…