పెళ్లంటే జీవితంలో ఒక్కసారి చేసుకుంటారు. తహతను బట్టి అంగరంగా వైభవంగా ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే దీనికి ముందు ఎంతో ప్రాసెస్ ఉంటుంది. పెళ్లి సంబంధాలు చూడటం ఓ కత్తి మీది సాములాగే ఉంటుంది. నచ్చిన జోడీ కోసం యువతీ యువకులు ఏళ్ల తరబడి నిరీక్షిస్తారు. అయితే వరులను అమ్మే సంత ఉందని తెలుసా..? వారపు సంతలో కూరగాయల మాదిరి పెళ్లి కొడుకులను వధువులు కొనుక్కోని వెళ్లే సంస్కృతి బీహార్‌లో శతాబ్ధాలుగా కొనసాగుతోంది. ఈ వింత పద్ధతులు ఏంటో తెలుసుకుందాం..

బీహార్‌లోని మధుబని జిల్లాలో ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు వరుల మార్కెట్ జరుగుతుంది. స్థానికులు ఈ పద్ధతిని ‘సౌరత్ సభ’ అని పిలుస్తారు. జిల్లా నలుమూలల నుంచి మైథిల్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు తమ కుమార్తెలను ఈ మార్కెట్‌కు తీసుకువస్తారు. వారికి నచ్చిన పెళ్లి కుమారుడుని ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఈ మార్కెట్‌కు వేల సంఖ్యలో వధూవరులు, వారి కుటుంబ సభ్యులు హాజరవుతారు. సాంప్రదాయ ధోతీ, కుర్తా దుస్తువులు ధరించి ఈ మార్కెట్‌కు వస్తారు వరులు. వధువుకు నచ్చిన వరుడుని కొనేముందు వారి ఆస్తులు, విద్యార్హతల విషయాలను కుంటుంబ సభ్యులు తెలుసుకుంటారు. అనంతరం రెండు కుటుంబాలు ఒప్పందం అయితే పెళ్లి నిశ్చయించుకుంటారు. మరోవైపు కట్నం లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడమే ఈ మార్కెట్ నిబంధన. కర్నాధ్ వంశస్తుల 700 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.