పోలీస్ కొలువు కోసమని ఈవెంట్స్ కి వస్తే ఇంతలోనే తండ్రి మరణవార్త తెలియడంతో షాక్ కు గురైన అభ్యర్థి శోకసంద్రంలో మునిగిపోగా , అందరినీ కంటతడి పెట్టించించిన ఘటన …

పోలీస్ శాఖలో SI , కానిస్టేబుళ్ల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో సోమవారం నుంచి హన్మకొండలోని జేఎన్ఎస్ మైదానంలో దేహదారుడ్య , రన్నింగ్ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు . ఈ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం మాన్ సింగ్ తండాకు చెందిన బానోత్ గణేశ్ ,వరంగల్ లోని కాకతీయ విశ్వ విద్యాలయంలో పీజీ పూర్తిచేసి పోలీస్ ఉద్యోగానికి ప్రిపేరవుతున్నాడు . సోమవారం జరిగే పోలీస్ ఈవెంట్స్ గణేశ్ హాజరుకావాల్సి ఉండగా , అదివారం హన్మకొండలోని JNS మైదానం వద్దకోచ్చాడు . ఇంతలోనే తండ్రి నర్సింహ ఆనారోగ్యంతో మృతి చెందాడని సమాచారం తెలియడంతో బోరున విలపిస్తుండగా “ ఓ విలేకరి (నమేస్తే తెలంగాణ) ‘ కంటపడింది . రోదిస్తున్న గణేశ్ విషయాన్ని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ వెంకట్ రెడ్డిని కలిసి సమాచారాన్ని ఆయన దృష్టికి తెచ్చింది . స్పందించిన డీసీపీ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు . వారి ఆదేశాల మేరకు మార్చి 20 లోపు ఎప్పడు పిలిస్తే అప్పుడు వచ్చి ఈవెంట్స్ లో పాల్గొనాలని గణేశ్ కు సూచించారు బరు వెక్కిన హృదయంతో కన్నీటిని దిగమింగుతూ ధ్యాంక్స్ అన్న అంటూనే తండ్రిని చివరిసారిగా చూడటానికి గణేశ్ సొంతూరుకు వెళ్లారు .